26.2 C
Hyderabad
Monday, August 3, 2026

గరిబోనికి నిజంగా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశం ఏమైనా ఉందా

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పొంగులేటి “మీరు సమీక్షలు మాత్రమే చేస్తారా? గరిబోనికి నిజంగా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశం ఏమైనా ఉందా అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  ప్రశ్నించారు. మూడు నెలల డెడ్ లైన్ లో నియోజకవర్గనికి 3500 ఇందిరమ్మ ఇండ్లతో పాటు  డబుల్ ఇండ్లు మరమ్మతు చేసి పంపిణి చేయకపోతే నిరాహార దీక్షకుదిగుతామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు మన నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా హౌసింగ్ మంత్రి పొంగులేటి వైఖరి దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉందని ఏద్దేవా చేసారు. గత కొంతకాలంగా చూస్తుంటే, మంత్రిగా సమీక్షలు నిర్వహిస్తూ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటాడం లేదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రస్థావించిన ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ లకు పోగులేటి ఇచ్చిన హామీలను గుర్తు చేసారు. గత ఏడాది కలెక్టర్, అధికారులతో సమీక్ష చేసి “దసరాకే ఇళ్లు ఇస్తాం” అన్నారు. ఇప్పుడు ఇంకో దసరా వచ్చింది – ఇళ్లకు మాత్రం మోక్షం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం   ఇందిరమ్మ ఇండ్లు “ఏటా 3,500 ఇళ్లు” ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది –ఎన్ని ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు జరిగాయో సమాధానం చెప్పాలని అన్నారు. “జాగా ఉన్నవాళ్లకే ఇల్లు” అంటున్నారు.. అర్బన్ ఏరియాలో ఒక కార్మికుడికి, ఒక ఆటో డ్రైవర్‌కి గజం జాగా దొరుకుతుందా? దొరకదనే విషయం ప్రభుత్వం అంగీకరించాలన్నారు. మీ పార్టీకి మిత్రపక్షమైన బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ భూములు కబ్జా చేశారు, చివరికి చెరువులు కూడా వదిలిపెట్టలేదు – ఇప్పుడు గజం జాగా ఎక్కడి నుంచి తేవాలన్నారు. మొదటి విడతలో జాగా ఉన్నవాళ్లతో పాటు లేనివాళ్లకు ఇళ్ళు నిర్మించి 3500 భర్తీ చేయాలన్నారు. ఇళ్లు ఇస్తే – రెండో విడతలో జాగా లేని అర్హులకు ప్రభుత్వం కట్టించి ఇళ్లు ఇవ్వాలి. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. మూడునెలల్లో ఇండ్ల మరమ్మతులు పూర్తి చేసి, లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలి. జరగకపోతే – లబ్ధిదారులతో కలిసి నేను ఉద్యమానికి దిగుతమన్నారు. మా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద ఇళ్లు ఇస్తోంది.కేంద్రం వాటా కలిపి ఇస్తున్న ఇండ్లపై ప్రధాని గారి పేరు, ఫోటో ఉండాలని డిమాండ్ చేసారు.

Is there really any intention to give a house to the poor?

More articles

Latest article