27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సమస్యల పరిష్కారానికి తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నాయకులు బుధవారం తహసిల్దార్ వెంకట్రావుకు ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లేల సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాలు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఇప్పటివరకు తమ పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు తమ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.త్వరలోనే మీ  సమస్యలకు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారన్నారు.ఇప్పటి వరకు తమ సమస్యలను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేసేలా వెంటనే జీవో జారీ చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కారం కానట్లయితే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తరఫున భారీ ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి సైతం వెనకాడమని అన్నారు.ఈ కార్యక్రమంలో యానం విజయ్ కుమార్ (ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం) రాసరి పెంటన్న (డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్,) అబ్దుల్ హకీం (డిటిఎఫ్) చంద్రశేఖర్, ప్రేమ్ సింగ్, గంగాధర్ ,కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article