కామారెడ్డి, బతుకమ్మ: రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా నియమితులైన, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రేపు(శనివారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న హర్టికల్చర్ కార్యాలయంలో ఉదయం 9.30గంటలకు పోచారం బాధ్యతలు స్వీకరిస్తారని, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొనాలని నిజామాబాద్ డీసీసీబీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ రాష్ర్ట నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి కోరారు.
