బతుకమ్మ, ఏర్గట్ల :
ఎర్గట్ల తొర్తి గ్రామంలో ‘నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం,కార్యక్రమంలో భాగంగా విత్తనోత్పత్తికై పంపిణి చేసిన వరి క్షేత్రాన్ని మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ విస్తీర్ణాధికారి మనీష పరిశీలించడం జరిగింది. నాణ్యమైన విత్తనాన్ని రైతులద్వారా పండించి తోటి రైతులకి అందించాలనే ఉద్దేశంతో వ్యవసాయ విశ్వవిద్యాలయం , వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.ఇందులోభాగంగా రైతు దానం గంగమోహన్, సాగు చేస్తున్న వరి క్షేత్రాన్ని సందర్శించి మంచి దిగుబడి సాధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించడమైంది ఇట్టి కార్యక్రమంలో రైతులు దానం గంగమోహన్,సల్ల రాజేశ్వర్, అడ్వాలా స్వామి,పాల్గొన్నారు.
