27.5 C
Hyderabad
Friday, July 31, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల

Must read

📰 Generate e-Paper Clip

కమ్మర్ పల్లి, బతుకమ్మ : మండలం లోని పలు గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలను  బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సోమవారం పరామర్శించారు.ఇందులో భాగంగాvమండలంలోని హాసకొత్తూర్ గ్రామానికి చెందిన వడ్డెర శేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా  వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారిది పేద కుటుంబం కావడంతో వారికి రూ.10000 పదివేల ఆర్థిక సహాయాన్ని అందించారు. అదే గ్రామానికి చెందిన జుంబరాత్ అన్వేష్ ఇటీవల గల్ఫ్ దేశం ఓమన్ లొ దురదృష్టవశాత్తూ చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ప్రభుత్వం  అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల సహాయాన్ని అందించే విధంగా కృషి చేస్తానని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం ఉప్లూర్ గ్రామానికి చెందిన అజయ్ వల్ల అమ్మ  రాజవ్వ చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బద్దం రమేష్ వల్ల నాన్న భూమన్న ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతోవారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article