. . .మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఘాటు హెచ్చరిక
వర్ని, బతుకమ్మ:
బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు అంటూ మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ కాంగ్రెస్ ఇంచార్జీ ఏనుగు తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటివరకు గాంధీ మార్గంలో నడిచమని, దీనినే వారు ఆసరాగ తీసుకొని తన మనుషులపై పోచారం గుండాలు దాడి చేయడం పట్ల ఏనుగు తీవ్రంగా స్పందించారు. గురువారం రాత్రి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గులాబీ గుండాల దాడిలో గాయపడ్డ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భీమా శంకర్, ఆయన కుమారుని పరామర్శించారు. ఈ సంధర్బంగా ఎనుగు మాట్లాడుతు…నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని వడ్డేపల్లి గ్రామంలో ఇటీవల బారసా నుంచి కాంగ్రెస్ లోకి చేరిన గుండాలు, తమ సీనియర్ నాయకుడు భీమశంకర్ ఇంటిపై దాడి చేయడమే కాకుండా , పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వారిపై కూడా దాడి చేస్తే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఏనుగు రవీందర్ రెడ్డి ఆరోపించారు. గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులపై కొత్తగా పార్టీలోకి వచ్చిన బిఆర్ఎస్ గుండాలు దాడిచేసి చంపే ప్రయత్నం చేయడం, మళ్లీ పోలీస్ స్టేషన్లో కూడా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఏనుగు ప్రశ్నించారు. తక్షణం భీమశంకర్ ఇంటి ప దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 35 సంవత్సరాలగా గత టిడిపి టిఆర్ఎస్ పార్టీలతో ధైర్యంగా కొట్లాడిన ఏ కాంగ్రెస్ కార్యకర్తకైనా దాడికి పాల్పడితే ,ఎంత పెద్ద నాయకులైన ఊరుకునే ప్రసక్తే లేదు ఖబర్దార్ అంటూ ఏనుగు రవీందర్ రెడ్డి పోచారం వర్గీయులకు హెచ్చరించారు.ఇక్కడ జరిగినటువంటి దుర్మార్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి , పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఇన్చార్జి మంత్రి జూపల్లి , షబ్బీర్ అలీ , సుదర్శన్ రెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షాట్కర్ , ఉమ్మడి జిల్లా నాయకుల దృష్టికి తీసుకెళ్లి దీని వెనకాల ఎంత పెద్ద తలకాయనున్నా వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని భీమశంకర్ కుతగిన న్యాయం జరిగే విధంగా చూస్తానని భరోసా ఇచ్చారు.
