30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రజల శ్రేయస్సు, రైతుల సంక్షేమమే నా ఆకాంక్ష

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే మదన్ మోహన్
  • శ్రీ ముత్యాల పోచమ్మ బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని  పట్టణ కేంద్రం, ఘనంగా నిర్వహించబడిన శ్రీ శ్రీ శ్రీ ముత్యాల పోచమ్మ బోనాల వేడుకల్లో స్థానిక ముఖ్య అతిధి గా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, భక్తులు, భజన బృందాలు, డీజే లతో ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. అనంతరం భక్తులతో కలిసి పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ శ్రీ పోచమ్మ తల్లి దేవి కృప ఎల్లారెడ్డి ప్రజలందరిపైనా ఉండాలన్నారు. ప్రతి ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నిలకడగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. రైతులకు మంచి పంటలు పండాలి, మార్కెట్‌లో సరైన ధరలు లభించాలి ఇదే నా ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వందలాది మంది కాలనీ వాసులు, మహిళలు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

My aspiration is the well-being of the people and the welfare of the farmers.

More articles

Latest article