30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ఆకస్మిక తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల ఎరువుల దుకాణాలను  జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవింద్ శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతులకు తగినంత యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులు తమకు కావలసిన యూరియాను విడతల వారీగా తీసుకెళ్లాలని, తగిన మోతాదులోనే పంటకు వేయాలని తెలిపారు. మోతాదుకు మించి నత్రజని యూరియా ఎరువులను వాడితే పంటలకు చీడపీడల ఉధృతి పెరిగి దిగుబడి తగ్గే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఎరువుల దుకాణాలలో యూరియా నిలువలను తనిఖీ చేసి రికార్డులను ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలని, పిఓఎస్ మిషన్ల  ద్వారానే విక్రయించాలని ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించిన అధిక ధరలకు అమ్మిన తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జెడిఏ వెంట నిజామాబాద్ అర్బన్ ఏడిఏ  వీరస్వామి,మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి,ఏఈఓ చక్రపాణి ఉన్నారు.

District Agriculture Officer conducts surprise inspections at fertilizer stores

More articles

Latest article