ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ఆకస్మిక తనిఖీలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవింద్ శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతులకు తగినంత యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులు తమకు కావలసిన యూరియాను విడతల వారీగా తీసుకెళ్లాలని, తగిన మోతాదులోనే పంటకు వేయాలని తెలిపారు. మోతాదుకు మించి నత్రజని యూరియా ఎరువులను వాడితే పంటలకు చీడపీడల ఉధృతి పెరిగి దిగుబడి తగ్గే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఎరువుల దుకాణాలలో యూరియా నిలువలను తనిఖీ చేసి రికార్డులను ఎప్పటికప్పుడు వివరాలను...