26.2 C
Hyderabad
Monday, August 3, 2026

జ్యోతిబాపూలే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : డిచ్పల్లి మండలం ధర్మారం(బీ ) గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించారు. ఆహార  పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని నిర్వాహకులకు సూచించారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక బోధన

Collector makes surprise inspection of Jyothibapule's school

అందిస్తూ, మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా అంకిత భావంతో కృషి చేయాలని పాఠశాల నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు.  అంతకుముందు ఆఫీస్ రూంలో పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ లతో సమావేశమై, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పర్యవేక్షణ అధికారి ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పాఠశాల నిర్వహణను పక్కాగా పర్యవేక్షించాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ ప్రకారం ప్రతిరోజూ ఉడకబెట్టిన కోడిగుడ్లు అందిస్తున్నారా, టెండర్ ప్రక్రియ పూర్తయిందా అని ఆరా తీశారు. భోజనం తయారు చేసేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు. సిబ్బంది అటెండెన్స్, ఇతర రికార్డులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల రోజువారీ దినచర్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్.సీ.ఓ సత్యనాథ్ రెడ్డి, డిచ్పల్లి తహసీల్దార్  సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Collector makes surprise inspection of Jyothibapule's school

More articles

Latest article