జ్యోతిబాపూలే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, బతుకమ్మ : డిచ్పల్లి మండలం ధర్మారం(బీ ) గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించారు. ఆహార ...