26.3 C
Hyderabad
Monday, August 3, 2026

సతి ని కడతేర్చిన  పతి కి యావజ్జీవ కారాగార శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

భర్త, భార్య వారిద్దరికీ ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు.సాఫీగా సాగిపోవలసిన వారి కాపురం మద్యానికి బానిస అయిన భర్త బాధ్యతలేని బతుకు చూసిన భార్య పిల్లల భవిష్యత్ ను ఎరుక చేసింది. ప్రతిరోజు మద్యం తాగి వస్తే  ఎట్లా పిల్లల బాగోగులు, చదువు సంధ్యలు ఏమి గాను అంటూ సంసారపు నడకను ఎత్తిజుయించేది. నాకే పాఠాలు చెబుతావా, రోజు నీ నస భరించలేక ఉన్న అని కక్ష పెంచుకుని అదునుచూసి ఆలిని అంతం చేశాడు. కన్న తల్లిని కన్న తండ్రే కడతేర్చిండని  పిల్లలు కీ విట్   నెస్ గా మారిండ్రు. తీర్పుతో భార్యను చంపిన భర్త జీవితాంతం కటకటాల పాలు. పెద్దమ్మాయికి పెళ్లి కావడంతో భర్తతో ఉంటుంది. చిన్న కూతురు చిట్టి, కొడుకు తల్లి లేని, తండ్రి ఉన్న లేని పరిస్థితి. అతి మద్యం అనర్ధాలకు మూలం.చివరికి కుటుంబం చిన్నాభిన్నం అయ్యింది.

నిజామాబాద్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇంచార్జీ జడ్జి నిజామాబాద్ సెషన్స్ జడ్జి జి. వి. ఎన్ భారత లక్ష్మీ వెలువరించిన ఇరవై ఏడు పేజీల తీర్పులోని వివరాలు.. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం గన్య తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రూప్ సింగ్ తండా కు చెందిన కేలోత్ శ్రీనివాస్ అలియాస్ సుధాకర్, కేలోత్ సరిత భార్యాభర్తలు వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.భార్యాభర్తలు కూలి నాలి చేసుకుని బతుకుతున్నారు.శ్రీనివాస్ కు మద్యానికి బానిస అయి ప్రతి రోజు మద్యం తాగి వచ్చేవాడు. కుటుంబ బరువు బాధ్యతలు చూడాల్సిన సమయంలో మధ్యానికి డబ్బంతా దార పోస్తే ఎట్లా అంటూ భార్య బాధ్యతను గుర్తు చేసేది. ఇది ఇద్దరి మధ్య గొడవకు దారి తీసేది.01 మార్చి 2024 న మద్యం సేవించి వచ్చిన భర్తతో మల్లి గొడవ పడింది. ప్రతి రోజు తన భార్య గొడవ పడటం, ప్రశ్నించడం తట్టుకోలేని అతను భార్యను చంపివేయాలని నిర్ణయించుకొని గొడ్డలి పదును మొనతో చంపేస్తే రక్తం చింది హత్యగా భావిస్తారని భావించి గొడ్డలి పదును లేని భాగంగా ఆమె తలపై, ఇతర చోట్ల విపరీతంగా కొట్టడం మూలంగా తల మొద్దు బారి చనిపోయిందనే ఫోరెన్సిక్ నివేదిక, కన్న కూతుర్లు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం, ఇతర సాక్షుల వాంగ్మూలం, ధ్రువీకరించు కున్న పత్రాలు, వస్తుగత సాక్ష్యాలు పరిగణలోకి తీసుకుని ముద్దాయి కేలోత్ శ్రీనివాస్ పై హత్య నేరారోపణ, సాక్ష్యాలు తారుమారు చేశాడనే మరొక నేరారోపణ కోర్టు నేర న్యాయ విచారణ లో రుజువై నట్లు నిర్ధారిస్తూ అతనికి హత్య నేరం ప్రకారం జీవిత కారాగార శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించారు. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు గాను ఏడు సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించారు

More articles

Latest article