29 C
Hyderabad
Monday, August 3, 2026

గంజాయి విక్రేత ఖాజాబి పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

  • 450 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరాన్ని అడ్డాగా చేసుకుని రెండు దశాబ్ధాలుగా గంజాయి, దేశిదారు, గుడుంబా లాంటి మత్తు పదార్థాలను విక్రయిస్తు పోలీస్,  అబ్కారీ శాఖకు సవాల్ గా మారిన ఖాజాబిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. తన ఇంటి వద్ద ద్వారక నగర్ లో బహిరంగంగా గంజాయిని విక్రయిస్తున్న ఖాజాబిని శుక్రవారం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ స్వప్న ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి 450 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఖాజాబిపై నిజామాబాద్ నగరంలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ తో పాటు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లలో పలుమార్లు కేసులు నమోదు అయ్యాయి. ఖాజాబీ పై 8 సంవత్సరాల క్రితం చివరి సారిగా ఎఫ్ఐఆర్ నమోదు కాగా గత కొంత కాలంగా తన ఇంటి వద్దనే ఎవ్వరికి అనుమానం రాకుండా ఎండు గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు తెలిసి ఎన్ ఫోర్స్ మెంట్ పక్కా సమాచారంతో దాడి చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరిలించారు. ఈ దాడిలో ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్ఐలు నర్సింహచారీ, రామ్ కుమార్, హెడ్ కానిస్టెబుళ్లు రాజన్న, భూమన్న, శ్రీను ప్రసాద్, కానిస్టెబుళ్లు బోజన్న, హమీద్, శివ, గంగారాం, శ్యాం సుంధర్, సాయి కుమార్, సుకన్య, మంజులలు పాల్గొన్నారు.

More articles

Latest article