గంజాయి విక్రేత ఖాజాబి పట్టివేత
450 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరాన్ని అడ్డాగా చేసుకుని రెండు దశాబ్ధాలుగా గంజాయి, దేశిదారు, గుడుంబా లాంటి మత్తు పదార్థాలను విక్రయిస్తు పోలీస్, అబ్కారీ శాఖకు సవాల్ గా మారిన ఖాజాబిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. తన ఇంటి వద్ద ద్వారక నగర్ లో బహిరంగంగా గంజాయిని విక్రయిస్తున్న ఖాజాబిని శుక్రవారం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ స్వప్న ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి...