26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రోడ్డుపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: మండలంలోని మేనూర్ గ్రామంలో రైతులకు ఇన్ ఛార్జ్ ఏఎంవిఐ శ్రీనివాస్ రెడ్డి అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారవుతున్నాయని ప్రజలకు నడవడానికి ఏర్పాటు చేసిన రోడ్లపై  ట్రాక్టర్ కేజీ వీల్స్ తిప్పరాదని అలా తిప్పిన వాటిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. గురువారం రెండు కేజీ వేల్స్ సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. మట్టి రోడ్లపై పొలాల్లో మాత్రమే కేజీ వీల్స్ ట్రాక్టర్లు నడిపించాలని సూచించారు.

More articles

Latest article