29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రెండవ స్నాతకోత్సవ ఏర్పాట్లు పూర్తి

Must read

📰 Generate e-Paper Clip

  • వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్.టి. యాదగిరి రావు

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయంలో  ప్రతిష్టాత్మకంగా  బుధవారం జరిగే రెండవ స్నాకోత్సవానికి ఏర్పాట్లు  పూర్తయ్యాయని  వైస్ -ఛాన్స్లర్  ఆచార్య టి.యాదగిరిరావు తెలిపారు. స్నాతకోత్సవ ప్రాంగణంలో  మంగళవారం స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందం, బాంబు డిస్పోజల్ టీం  అధికారులు నిషితంగా పరిశీలించారు. అనంతరం ఏడవ పటాలపు గాడ్ ఆఫ్ హోనర్ టీం,బ్యాండ్ టీం ఆర్ఎస్ఐ కొమ్ము శ్రీకాంత్  ఆధ్వర్యంలో వైస్ ఛాన్స్లర్ ప్రో. టి యాదగిరిరావు కి, కమిషనర్ ఆఫ్ పోలీస్  సాయి చైతన్యకు  గౌరవ వందనం సమర్పించారు.    వైస్ ఛాన్స్లర్  ప్రొఫెసర్ యాదగిరి రావు, రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎం యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ ల తో   డీన్స్ తో కలిపి    మాక్  సెషన్ నిర్వహించారు. మాకు డ్రిల్ కార్యక్రమంలో   రిసెప్షన్ కమిటీ, డయాస్ కమిటీ, సీటింగ్ ఏర్పాటు కమిటీ, సెనేట్ కమిటీ, ప్రింటింగ్ కమిటీ, హాస్పిటాలిటి కమిటీ, ఎంట్రీ అండ్ రెగ్యులేషన్ కమిటీ, ప్రెస్ సెండ్ మీడియా కమిటీ, ట్రాన్స్పోర్టేషన్ కమిటీ, డిస్ట్రిబ్యూషన్ కమిటీ, డిసిప్లిన్ కమిటీ, గోల్డ్ మెడల్స్ నిర్వహణ కమిటీ, క్యాంపస్ రిజర్వేషన్ కమిటీ కన్వీనర్లు  ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్, ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ అపర్ణ, ప్రొఫెసర్ హారతి, ప్రొఫెసర్ రాంబాబు, ప్రొఫెసర్ ఆంజనేయులు, ప్రొఫెసర్ కె రవీందర్ రెడ్డి,ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ప్రొఫెసర్ నాగరాజు పాత, పిఆర్వో డైరెక్టర్ డా. ఏ పున్నయ్య లతో పాటు  బోధన బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు.

Arrangements for the second graduation ceremony are complete

More articles

Latest article