25.3 C
Hyderabad

ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గాండ్ల మధు అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న ( అలియాస్ చింతపండు నవీన్) అసభ్యకరంగా అనుచిత వాక్యాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తీన్మార్ మల్లన్న వైఖరిని మార్చుకోవాలని, మరోసారి ఎమ్మెల్సీ కవితపై అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొట్టే గజేందర్, నీరడి సాయులు, సాయి కిరణ్, ఎండి.మతీన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article