ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

రుద్రూర్, బతుకమ్మ: జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గాండ్ల మధు అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న ( అలియాస్ చింతపండు నవీన్) అసభ్యకరంగా అనుచిత వాక్యాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తీన్మార్ మల్లన్న వైఖరిని మార్చుకోవాలని, మరోసారి ఎమ్మెల్సీ కవితపై అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని...