బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ రూరల్ సిఐగా తిరుపతయ్య ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ సిఐగా పనిచేసిన రాజేశ్ హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తిరుపతయ్య మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. అలాగే మహిళల రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంపై దృష్టి సారిస్తామన్నారు.స్థానిక పోలీస్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
