- పోలీస్ కమిసనర్ సాయిచైతన్య
- దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు రూట్ మ్యాప్ పరిశీలన
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఊర పండగ సందర్భంగా ఆదివారం నగరంలో నిర్వహించే శోభాయాత్రం రూట్ మ్యాప్ ను శనివారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. ఈ రూట్ మ్యాప్ కార్యక్రమం రఘునాథ ఆలయం ఖిల్లా చౌరస్తా నుండి ప్రారంభమై వివేకానంద చౌరస్తా, లక్ష్మీ మెడికల్, గాజుల్ పెట్ , పెద్ద బజార్, గోల్ హనుమాన్ , పూలాంగ్ చౌరస్తా , వినాయక నగర్ ఆర్యా నగర్, దుబ్బ తదితర ప్రాంతాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పటిష్ట బందోబస్తు, పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని , ప్రజలందరూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం , నగర సీఐ శ్రీ శ్రీనివాసరాజ్, ఊర పండగకు సంబంధించిన ముఖ్య సభ్యులు రామ్మర్తి గంగారాం , గాండ్ల లింగం , రాజేందర్ ధుoపేట , విజయ గజ్బింకర్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

