23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పురపాలక అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మదన్ మోహన్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో మొత్తం రూ.15 కోట్ల ప్రతిపాదనలు చేపట్టబడ్డాయి.  తాత్కాలిక షాపులకు శాశ్వత భవనాల నిర్మాణానికి షాపింగ్ కాంప్లెక్స్ కోసం రూ.5 కోట్లు, మున్సిపాలిటీ అన్ని వార్డుల్లో CC రోడ్ల మరియు మురికి కాలువ లకి రూ.4 కోట్లు, గాంధీ విగ్రహానికి  జంక్షన్ ఏర్పాటకు రూ.1 కోటి, మున్సిపాలిటీతో విలీనం అయిన గ్రామాల అభివృద్ధికి రూ.2 కోట్లు, పెద్ద చెరువు వద్ద మల్టీ జెనరేషన్ పార్క్ నిర్మాణానికి రూ.3 కోట్లు ప్రతి పాదనలు పంపించారు. పై పనులన్నీ ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే ప్రారంభించాలని తీర్మాణం చేశారు. మున్సిపాలిటీ పరిధి లో వైకుంఠధామంలో పెండింగ్‌లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అని కాంట్రాక్టర్ ని అదేశించారు.ఇటీవల యెల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ లో భాగంగా నిర్మించిన తడి పొడి ఏర్పాటు కేంద్రం, కంపోస్ట్ షెడ్ త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.

More articles

Latest article