29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

Must read

📰 Generate e-Paper Clip

  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పట్ల హర్షం

 

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు.ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ అప్ప శేట్కర్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం అని తెలిపారు.రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు.స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు బీసీ రిజర్వేషన్ల అమలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్ష నియం అన్నారు. పంచాయతీరాజ్ చట్టం -2018 కి సవరణలు చేయాలని త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేసేలా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శంకర్, మాజీ జెడ్పిటిసి నాగనాథ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, శాహిల్ శెట్కార్,దశరథ్ స్వామి,హనుమాన్లు,సీమ గంగారామ్,నౌష నాయక్, బొగడ మీద సాయిలు, తుకారం,నాగరాజ్ సెట్,ఖలీల్ శంకర్,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article