- టెక్నికల్ అసిస్టెంట్ తో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ ల సస్పెన్షన్
- నిధుల దుర్వినియోగంపై రికవరీకి ఆదేశాలు జారీ
తాడ్వాయి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో గత నెల 27న ప్రజావేదికలో వచ్చిన అబియోగాల మేరకు సోషల్ అడిట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహరంలో తాడ్వాయి మండలం టెక్నికల్ అసిస్టెంట్ ఎ.మహిపసాల్ రెడ్డి తాడ్వాయి మండలం లోని గ్రామ పంచాయతీలలో చేపట్టిన పనుల యందు నిధుల దుర్వినియోగం, విధుల పట్ల నిర్లక్ష్యం చేసినందుకు అతడిని సస్పెన్షన్ చేస్తు జిల్లా గ్రామీణ అభివ్రుద్ధి సంస్థ సంయుక్త కార్యదర్శి సురేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం చేసిన రూ.1,00,560 నగదు రికవరీతో పాటు రూ.18,62,803 నిధుల క్యూసీ వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన స్పందించకపోవడంతో సస్పెండ్ చేస్తు ఉత్వర్వులు జారీ చేశారు. తాడ్వాయి మండలం ఎర్రపహడ్ క్షేత్ర సహయకులు (ఫీల్డ్ అసిస్టెంట్ ) జి.బాలరాజు 16వ విడతలో జరిగిన సామాజిక తనిఖీలో నిధుల దుర్వినియోగం, విధుల పట్ల నిర్లక్ష్యం చేయడంతో అతనిని సస్పెన్షన్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. అతడి వద్ద రూ.91,108 నగదు రికవరికి ఆదేశాలు జారీ చేశారు.
