28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రితో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ భేటీ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ సెక్రటేరియట్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్లు అండ్  భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న, నూతన రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే  అభ్యర్థనకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ రూ.250 కోట్ల నిధులను మంజూరు చేయడానికి అంగీకరించారు. అవసరమైన ఫైల్, రిపోర్టులను వెంటనే సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా హ్యామ్ (హైబ్రిడ్ యన్యుటీ మోడల్)లో నిర్మించబోయే 12వేల కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రోడ్లను చేర్చాలని, అలాగే కరీంనగర్ – కామారెడ్డి – ఎల్లారెడ్డి రోడ్డును నేషనల్ హైవే గా గుర్తించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article