30.9 C
Hyderabad
Monday, August 3, 2026

నగరంలో ఊర పండుగకు అంకురార్పణ

Must read

📰 Generate e-Paper Clip

బండారు పోసిన సర్వసమాజ్ ప్రతినిధులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ఊర పండుగ కు మంగళవారం సర్వ సమాజ్ ఆధ్వర్యంలో  అంకురార్పణ జరిగింది. ఈనెల 13న నగరంలో గ్రామ దేవతలను కొలిచే ఊర పండగ జరగనుంది. వానకాలంలో ప్రబలే అంటువ్యాధుల నుంచి ప్రజలను  కాపాడే గ్రామ దేవతలను కొలిచే సంప్రదాయం నగరంలో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఊరపండుగ ప్రారంభ సూచికగా  నగరంలోని గాజులుపేట్ లో బండారు కార్యక్రమం జరిగింది. సర్వ సమాజ్ కన్వీనర్ రామర్తి గంగాధర్, కో కన్వీనర్ ఆదే ప్రవీణ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బండారు పోశారు. స్థానిక కుల సంఘాలతో పాటు సర్వ సమాజ్ కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Inauguration of the village festival in the city

More articles

Latest article