25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలంలోని మల్కాపురం గ్రామానికి చెందిన భాజపా మండల పార్టీ అధ్యక్షుడు దళిత నేత పెద్దడ్ల నరసింహులు ఇటీవల నూతనంగా నిర్మిస్తున్న గృహాన్ని అధికారులు కూలగొట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ గ్రామాన్ని సందర్శించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా ఎవరికైనా అన్యాయం జరిగితే తక్షణమే స్పందిస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నా కూడా ఒక దళిత జాతికి చెందిన నర్సింలు రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేకనే అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఒత్తిడితో ప్రభుత్వ అధికారులు అక్రమంగా ఆయన నివాస గృహాన్ని కూల్చివేశారని ఆయన తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎంతోమంది ఎన్నో అక్రమాలు చేస్తున్న కూడా వారిని వదిలి కేవలం దళిత నేత అనే కారణంతో అందులో ప్రతిపక్ష భాజపా పార్టీలో ఉన్నాడని కక్షపూర్వకంగానే ఆయన ఇంటిని నేలమట్టం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత జాతికే కాకుండా నియోజకవర్గం లో ఎవరికి అన్యాయం చేసిన కోరుకునే ప్రసక్తి లేదని అలాంటి సమస్యలు తమ దృష్టికి వస్తే ఎంతటికైనా తెగించి బాధ్యత కుటుంబాల పక్షాన పోరాడుతానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తక్షణమే అధికారులు మల్కాపూర్ గ్రామంలో అక్రమ కట్టడాలను గుర్తించి విచారణ చేపట్టి నరసింహులు చేసిన విధంగానే ఇతరుల అక్రమ కట్టడాలను నిలమట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం నరసింహులు కుటుంబానికి 61,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జలంధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్, సొసైటీ అధ్యక్షులు ఏగుల నర్సింహులు పటేల్ సాయిలు, డి సి సి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎరుకల సాయిలు, భూమిగారి రాము, కామారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షులు నాగం సురేందర్, శ్రీనివాస్ నాయక్, శ్రవణ్, మాజీ సర్పంచ్ లు రఘువీర్ గౌడ్, అబ్దుల్ అలీ, మల్లారెడ్డి, నాగం రాజయ్య, వసంతం, గంగారెడ్డి, విట్టల్, పాల్తే నారాయణ, దయాకర్ పృథ్వీరాజ్, అరవింద్ గౌడ్, బర్కత్గుల్లా, కపిల్ రెడ్డి, రవి, ముధం సాయిలు, సాయిలు రాము తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article