బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలంలోని మల్కాపురం గ్రామానికి చెందిన భాజపా మండల పార్టీ అధ్యక్షుడు దళిత నేత పెద్దడ్ల నరసింహులు ఇటీవల నూతనంగా నిర్మిస్తున్న గృహాన్ని అధికారులు కూలగొట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ గ్రామాన్ని సందర్శించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా ఎవరికైనా అన్యాయం జరిగితే తక్షణమే స్పందిస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నా కూడా ఒక దళిత జాతికి...