27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • టీజీవీపీ నగర అధ్యక్షులు అఖిల్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫీజ్ రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి అని టీజీవీపీ నగర అధ్యక్షులు అఖిల్ ఆధ్వర్యం లో ప్రజావాణిలో  ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ  గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో 7500వేల కోట్ల ఫీ రియంబస్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్నచూపు చూసిందని, కొత్తగ ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల తో  పిట్టల దొర  వేషాలు  వేస్తుందని అన్నారు.  కాంగ్రెస్ పార్టీ ఆనాటి సీఎం వై ఎస్ రాజశేఖర్ చేపట్టిన ఫీ రింబస్మెంట్ స్కాలర్షిప్ పథకాని కొనసాగించ లేక పోతున్నారని తెలిపారు. అకాడమిక్స్ కంప్లీట్ అయిన విద్యార్థులు కాలేజ్ కి ఫీ కట్టలేక అప్పులు చేస్తున్నారన్నారు. పేద విద్యార్థులు, చదువు పై ఆశలు వదులుకుంటున్నారని అన్నారు. మధ్య తరగతి విద్యార్థుల తలిదండ్రులు అప్పులు చేసి పుస్త మట్టెలు అమ్మి విద్యార్థుల ఫీలు కట్టే పరిస్థి ఏర్పడింది అన్నారు. తక్షణమే బకాయిలను విడుదల చేయాలని లేని పక్షంలో కాంగ్రెస్ మంత్రులను, సీఎం ని ఎక్కడికి అక్కడ అడ్డుకుంటాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిద్దు,మహేష్ సుజిత్ తదితరులు పాల్గొన్నారు.

Pending dues should be released immediately1745

More articles

Latest article