27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

భీంగల్ లో జోరుగా మట్కా దందా

Must read

📰 Generate e-Paper Clip

  • అప్పులపాలై రోడ్డున పడుతున్న కుటుంబాలు
  • ముంబై కేంద్రంగా ఫోన్లో ఆట కొనసాగింపు
  • లక్షల్లో సంపాదిస్తున్న మట్కా ఏజెంట్లు

 

భీమ్ గల్, బతుకమ్మ : పైసా పెట్టుబడి లేకుండా, ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేకుండా, గుట్టు చప్పుడు కాకుండా కొందరు భీమ్ గల్ కేంద్రంగా మాట్కాను నిర్వహిస్తున్నారు. ముఖాముఖి మనిషిని కలవనవసరం లేకుండా ఫోన్ సహాయంతో రోజు మట్కా ఏజంట్లు లక్షల్లో మట్కా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. బొంబాయి ప్రధాన కేంద్రంగా ఫోన్ ద్వారా నిర్వహించే ఈ మట్కా చీకటి వ్యాపారం ద్వారా ఏజంట్లు మూడు పువ్వుల్లు, ఆరు కాయలుగా సంపాదిస్తున్నారు. ఈ మట్కా మాయలోపడిన అమాయక మట్కారాయుల్లు బానిసలుగా తయారఔతున్నారు. ఈ మట్కా మత్తులో అమాయకులు అప్పులు పాలు కాగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ మట్కా ఆటలో ఒక్క రూపాయి పెడితే పది రూపాయల చొప్పున లాభం వస్తుదన్న ఏజంట్ల మాటలు నమ్మి అప్పులు చేసి మట్కాలో పెట్టి నిండా మునుగుతున్నారు. లక్కుంటే లక్ష్మిదేవి వరిస్తుందని చెబుతూ మట్కా రాయుల్లు లక్షల్లో ఆటలో పెట్టి అప్పులపాలైతున్నారు. లెక్క తప్పితే బతుకు బస్టాండెనని తెలియక పోయిన దాంట్లోనే లేంకోవాలన్నా జీజ్జులో ఉన్నాయి ఉడప్ప చేసుకొంటున్నారు. మండల కేంద్రంలో చాప కింద నీరుల విస్తరించిన ఈ మట్కా దందా ఇప్పుడు గ్రామాల్లోజడలు విప్పుతోంది. మహారాష్ట్రలోని ధర్మబాద్ కు చెందిన ఏజంట్లతో లింక్ పెట్టుకొన్న కొందరు సబ్ ఏజెంట్లు ఈ మట్కా మహమ్మారిని నిర్వహిస్తు సొమ్ము చేసుకొంటున్నారు. ఈ మట్కా దందా రెండు రకాలుగా నిర్వహిస్తున్నట్లు, ఈ మట్కా కళ్యాణ్ ముంబై పేరుతోనిర్వహిస్తున్నట్లు అత్యంతా విశ్వసనీయ సమాచారం.ఈ ఆట ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు రెండు ఆటలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ రెండు ఆట ఫలితాల్లో సాయంత్రం 4.15 కు ఓపెన్ ఫలితం,సాయంత్రం 6.15 కు క్లోజింగ్ ఫలితాలు, మళ్ళీ రాత్రి 9.45 కు ఓపెన్ ఫలితాలు, అర్ద రాత్రి 12.15 కు క్లోసింగ్ ఫలితాలు వస్తున్నట్లు తెలిసింది.ఈ రెండు ఫలితాలను కలిపి జాయింట్ చూస్తారని తెలిసింది. అయితే ఈ సింగల్ నెంబర్ మీద డబ్బులు రూపాయి పెడితే రూ. 9వస్తాయని, ఆదే జాయింట్ నెంబర్ మీద రూపాయి పెడితే రూ. 90 వస్తాయని నమ్మిన మట్కా రాయుల్లు ఇబ్బడి ముబ్బాడిగా డబ్బులు వేచ్చిస్తు మోస పోతున్నారు. ఈ మట్కారాయుల్లు ఈ క్రీడాలో మునిగి నిద్రకు దూరమౌతుండడం తో పాటు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఉదయం నుండి అర్థ రాత్రి వరకు ఈ మట్కా ఫలితాల ధ్యాసలో తమ పనులను మాని అదే పనిగా మట్కాలో లీనమౌతున్నారు. ఒక్కసారి మట్కా క్రీడాలో కాలు పెట్టినవాళ్లు పోయిన డబ్బులు తిరిగి వస్తాయని, ఇరువై సార్ల డబ్బులు పోయిన ఒక్కసారి నెంబర్ తగిలితే రాత మారిపోతుందన్న ఆశతో మళ్ళీ మళ్ళీ డబ్బులు పెట్టి ఆర్థికంగా చితికి పోతున్నారు. పట్టణం లో విస్తరించిన ఈ మట్కా మహమ్మారి గ్రామాల్లో విస్తరంచకుండా స్థానిక పోలీసులు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

More articles

Latest article