బతుకమ్మ, జుక్కల్ : బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కు సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బిచ్కుంద టౌన్ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారానికై జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యం కల్పించి కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, ప్రతి నెల ఐదవ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షులు భూమయ్య, ప్రధాన కార్యదర్శి రాజు, కార్మికులు సాయిలు, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.
