25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

చౌదరి పల్లి గ్రామంలో రైతు కమిషన్ బృందం పర్యటన

Must read

📰 Generate e-Paper Clip

రంగారెడ్డి, బతుకమ్మ : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదరి పల్లి గ్రామంలో శుక్రవారం రైతు కమిషన్ బృందం పర్యటించింది. చౌదరి పల్లి గ్రామంలోని ఆదర్శ రైతు కాశమల్ల వెంకట్రాములు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించింది. పట్టుపురుగుల పెంపకం చేపడ్తున్న రైతు కాశమల్ల మల్లేష్ ఫామ్ ను పరిశీలించింది. మల్బార్ సాగు ద్వారా ఎలాంటి లాభాలున్నాయి, ఎంతకాలం నుండి ఈ సాగు చేస్తున్నారు అనే విషయాలను రైతు కమిషన్ బృందం అడిగి తెలుసుకుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కెవిఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, మెంబర్ సెక్రెటరీ గోవిందు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.

Farmers Commission team visits Chaudharypalli village

More articles

Latest article