26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తొలి అమరుడు, రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య గారి వర్ధంతిని గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు అశోక్ మాట్లాడుతూ – దొడ్డి కొమురయ్య గారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడిగా, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి ప్రతియువకునిలో నూతన ఉత్తేజం నింపే విధంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితులవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ సునీత, కురుమ సంఘ అధ్యక్షులు సిరిగిరి రామ్, సంఘ సెక్రటరీ గౌరుగొండ అశోక్, సభ్యులు నాగొండ మాధవరావు, రాములు, గంగాధర్, శివ, సాయి గండ, ఈరు గొండ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article