ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి
బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తొలి అమరుడు, రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య గారి వర్ధంతిని గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు అశోక్ మాట్లాడుతూ – దొడ్డి కొమురయ్య గారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడిగా, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి ప్రతియువకునిలో నూతన ఉత్తేజం నింపే విధంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు...