29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

త్వరలో సమస్య పరిష్కారం

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్,బతుకమ్మ:  మోర్తాడ్ మండలంలోని గాండ్లపేట గ్రామ ప్రజలు అక్కడ వాగులోకి వెళ్ళేటటువంటి వరద నీటి కాలువ లో పేరుకు పోయిన మట్టి వల్ల ప్రతి వర్ష కాలంలో పొలాలు మునిగిపోయి, రైతులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత పదిసంవత్సరాలుగా, వానాకాలం పంటను నష్ట పోతున్నామని పేర్కొన్నారు. ఇట్టి సమస్యను గ్రామ రైతులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి  దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. వారు వెంటనే స్పందించి బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గంగా ప్రసాద్, జిల్లా జనరల్ సెక్రెటరీ గిర్మాజీ గోపి,  మోర్తాడ్ పట్టణ అధ్యక్షుడు పుప్పాల అశోక్ లకు అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వడంతో వారు వెంటనే స్పందించి, ఇందిరమ్మ వరద కాలువ ప్రభుత్వ అధికారులతో,తెలిపి వారితో కలిసి సమస్య ఉన్నటువంటి ప్రాంతాన్ని శుక్రవారం సందర్శించడం జరిగింది. ప్రజల సమస్యను నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ భూమి రెడ్డి, ఎన్. ఎస్. యు. ఐ మండల ప్రెసిడెంట్ తోపార నిరాజ్, గాండ్ల పెట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  సాయిరాం, అశోక్, సంజీవ్, రాజేంద్రప్రసాద్ యువజన నాయకుడు ఆకుల ప్రభు కుమార్,  గుర్రం అశోక్, మూసాల నవీన్, గజేందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article