27.3 C
Hyderabad
Friday, July 31, 2026

మూడు రోజుల కళాశాలల బంద్ విజయవంతం

Must read

  • పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు 7500 కోట్లు విడుదల కై చేపట్టిన 72 గంటల  డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కళాశాలల బంద్ విజయవంతం అయ్యిందని  పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ తెలిపారు. పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో మూడవ రోజు నిజామాబాద్ నగరంలో ఉమెన్స్ డిగ్రీ,ఉషోదయ డిగ్రీ కళాశాలలో బంద్ చేయటం జరిగిందని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించటం లేదని , సంక్షేమ పథకాలకు వేలకోట్లు కేటాయించుకుంటున్నారు కానీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని  అన్నారు. డబ్బులు కట్టలేక విద్యార్థుల సర్టిఫికెట్స్ కళాశాలలలో ఉంటున్నాయని పై చదువులకు పేద మధ్య తరగతి విద్యార్థులు దూరం అవుతున్నారని , రియంబర్స్మెంట్ పథకన్నీ ఎత్తివేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు . మూడు రోజుల పాటు బంద్ కి సహకరించిన విద్యార్థులకు, విద్యాసంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా నాయకులు ,నిఖిల్, మనోజ్, నగర నాయకులు, సాయికిరణ్, . దుర్గాప్రసాద్, వంశీ  మరియు విద్యార్థులు తదితదిరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article