భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన నూతన ఎస్ఐ సందీప్ ను మండల బీజేపీ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. మండల పార్టీ ప్రెసిడెంట్ అరే రవీందర్ ఆధ్వర్యంలో ఎస్సైని శాలువాతో సన్మానించారు. మండల శాఖ తరపున బుక్స్, పెన్నులు ఎస్సైకిచ్చి పేద పిల్లలకి అందజేయ్యాలని వారు కోరారు. ఈ సందర్బంగా రవీందర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు వెళుతుందని, మా తరఫున మీకు ఎలాంటి ఆటంకం కలిగించమన్నారు. అదే క్రమంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖకు సహకరించాలని ఎస్సైని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య, జిల్లా బీజేవైఎం నాయకులు కొట్టాల అశోక్, మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు భూక్య మోహన్, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకటేష్, మండల పదాధికారులు,హరిప్రసాద్,కర్క నారాయణరెడ్డి, అశోక్,దెవెంధర్,మహెంధర్, సునీల్ పాల్గొన్నారు.
