23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

అంగన్​వాడీ కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఖలీల్

 

బతుకమ్మ, బాన్సువాడ : అంగన్​వాడీ కేంద్రాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఖలీల్ డిమాండ్​ చేశారు. బాన్సువాడ సబ్ కలెక్టర్​​ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్​వాడీ కార్యకర్తలకు అన్నివిధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదన్నారు. అంగన్​వాడీల్లో పదేళ్ల నుంచి వంటపాత్రలు కూడా ఇవ్వలేదని, పక్కా భవనాలు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. అంగన్​వాడీ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్​వాడీ ప్రాజెక్ట్​ అధ్యక్షురాలు మహాదేవి, శివగంగ, సెక్టర్ లీడర్ రేణుక, గౌరమ్మ, శివ జ్యోతి, సవిత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article