అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఖలీల్ బతుకమ్మ, బాన్సువాడ : అంగన్వాడీ కేంద్రాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఖలీల్ డిమాండ్ చేశారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడీ కార్యకర్తలకు అన్నివిధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదన్నారు. అంగన్వాడీల్లో పదేళ్ల నుంచి వంటపాత్రలు కూడా ఇవ్వలేదని, పక్కా భవనాలు, మరుగుదొడ్లు, నీటి...