24.6 C
Hyderabad

సిగాచీ రసాయన పరిశ్రమ స్థలాన్ని పరిశీలించిన ఏఐసీసీ ఇన్ చార్జి, టీపీసీసీ చీఫ్

Must read

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలిన ప్రమాద స్థలాన్ని ఏఐసీసీ ఇన్ చార్జి  మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పరిశీలించారు.  ప్రమాదం ఎలా జరిగిందో మీనాక్షికి మంత్రి దామోదర రాజ నర్సింహ వివరించారు. మంత్రి పర్యటన ఈసందర్భంగా గల్లంతైన వారి ఆచూకీ తెలపాలని బాధిత కుటుంబ సభ్యులు దామోదర రాజనర్సింహతో వాగ్వాదానికి దిగారు. వారిన ఆయన సముదాయించారు. ఈప్రమాదంలో 13 మంది ఆచూకీ తెలియకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. కాగా,ఈఘటనలో 36 మంది మరణించిన విషయం తెలిసిందే.

More articles

Latest article