- సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ
నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్టూడెంట్ పేరెంట్స్ తమ పిల్లల సమస్యను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాధారు మహ్మద్ షబ్బీర్ అలీని కలిశారు. స్థానిక పాలిటెక్నిక్ గ్రౌండ్లో సమావేశం కాగా షబ్బీర్ అలీ రాకను తెలుసుకొని ఆర్ అండ్ బి గేస్ట్ హోస్ లో కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా షబ్బీర్ అలీ సీ ఏం ఓ కు ఫోన్ చేసి సీ. ఏం తో మాట్లాడడానికి ప్రయత్నించిగా సీ. ఏం బీజీ ఉన్నారని తెలిపారు. దాంతో షబ్బీర్ అలీ పేరెంట్స్ తో మాట్లాడుతూ ఈ సమస్య రాష్ట్ర వ్యాప్త సమస్య అని, పెండింగ్ నిధులకు సంబంధించిన ఆర్ధిక పరమైన సమస్య కాబట్టి సీ. ఏం తో, సంబంధిత శాఖ మంత్రి తో మాట్లాడతానని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పేరెంట్స్ మాట్లాడుతూ స్కూల్లు ప్రారంభం అయ్యి 20 రోజులు దగ్గరికొచ్చిన ఇప్పటివరకు మా పిల్లలు ఇంటి వద్దే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బీ ఏ యస్ కు సంబంధించి జిల్లాలో ఉన్న అన్ని స్కూల్ వాళ్ళు పిల్లల్ని చేర్పించుకున్నారని, విజ్ఞాన్ స్కూల్ యజమాన్యం మాత్రమే రెసిడెన్సియల్ స్టూడెంట్లను తీసుకోవడం లేదని తెలిపారు. కలెక్టర్ చెప్పిన పిల్లల్ని తీసుకోవడం లేదని, మరి మా పిల్లల గతి ఏమిటని పేరెంట్స్ షబ్బీర్ అలీని అడిగారు.గవర్నమెంట్ బీ యస్ ఏ స్కీం లో స్కూల్ డ్రెస్ లు, పుస్తకాలు, షూస్ ఫ్రీ సప్లై చేస్తున్న ప్రతి యేటా మా పిల్లలకు మేమే కొనిస్తున్నామని తెలిపారు. ఆ విషయమై విచారణ జరిపిస్తానని ముందుగా పిల్లల స్కూల్ అడ్మిషన్ సమస్య పరిష్కారం అవ్వాలని అందుకు సీ. ఏం తో మాట్లాడుతానని సముదాయించి చెప్పి పంపారు.
