29 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ పాఠశాలలో వసతుల కరువు

Must read

📰 Generate e-Paper Clip

  • డీఎల్ఎస్ఏ ఉదయ్ భాస్కర్ రావు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు సోమవారం నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఒకటి నుండి నాల్గవ తరగతి వరకు తరగతులు ఉన్న ఉన్నవి రెండే క్లాస్ రూమ్స్  తో క్లాస్ లు ఎలా నిర్వహిస్తున్నారని ఉపాధ్యాయులను అడిగారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు అసలే లేకపోవడంతో జడ్జి విస్తుపోయారు. నాలుగు తరగతులకు ముగ్గురే టీచర్స్ తో విద్యార్థులకు చదువును నెట్టుకొస్తున్న తీరును ఆయన తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణమంత కలియ తిరిగి చూసి ఆవరణంత ఖాళీ బీరు బాటిల్స్, పాన్ పరాగ్ లాంటి వస్తువులు ఉండటం గమనించారు.ధర్మపురి హిల్స్ వాసుల సామాజిక బాధ్యతను తెలియజేయాలని, రాత్రి పూట అసాంఘిక వ్యక్తులకు పాఠశాల అడ్డగా మారకుండా చూడాలని ఉపాధ్యాయులకు ఎరుక పరిచారు.రాత్రి వేళల్లో స్థానిక ఆరవ పోలీస్ స్టేషన్ పోలీసులు పెట్రోలింగ్ చేసే విదంగా ఆదేశాలు జారీ చేస్తామని ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయుడు కూడా పోలీసులకు పిర్యాదు చేయాలని సూచించారు.

More articles

Latest article