ప్రభుత్వ పాఠశాలలో వసతుల కరువు

డీఎల్ఎస్ఏ ఉదయ్ భాస్కర్ రావు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు సోమవారం నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఒకటి నుండి నాల్గవ తరగతి వరకు తరగతులు ఉన్న ఉన్నవి రెండే క్లాస్ రూమ్స్  తో క్లాస్ లు ఎలా నిర్వహిస్తున్నారని ఉపాధ్యాయులను అడిగారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు అసలే లేకపోవడంతో జడ్జి విస్తుపోయారు. నాలుగు తరగతులకు ముగ్గురే టీచర్స్ తో...