- మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వైద్యరంగంలో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న వెల్ నెస్ అడ్వాన్సుడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిజామాబాదులో ప్రారంభించడం అభినందనీయమని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఖలీల్ వాడిలో ఆదివారం బోధన్ ఎమ్మెల్యే వెల్ నెస్ ఆసుపత్రిని ప్రారంభించారు. అత్యాధునిక వైద్య విధానంతో ఏడవ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. హైదరాబాద్ మహానగరానికి వెళ్లకుండా అత్యాధునిక వైద్య సౌకర్యాలతో మెరుగైన వైద్యాన్ని జిల్లా కేంద్రంలోనే అందుబాటులోకి తీసుకునిరావడం అభిందనీయమనిఅన్నారు. నిజామాబాద్ నగరంలో వెల్ నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడవ బ్రాంచ్ ను యాజమాన్యం సుమన్ గౌడ్, వివేకానంద రెడ్డి, అసద్ ఖాన్, నిజామాబాద్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ ల ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ముందర ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహీర్ బీన్ హందాన్, నూడ చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ ఆర్మూర్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథులచే జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు నిర్వహించి, హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ మా హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, గైనాలజీ, ఈ ఎన్ టీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్ కు సంబంధించిన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అతి తక్కువ ధరలతో కార్పొరేట్ వైద్యం నిజామాబాదులో అందించాలన్న సంకల్పంతో ఇక్కడ ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ప్రముఖ వైద్యులు, హాస్పిటల్స్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

