నిజామాబాద్ లో వెల్నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు అభినందనీయం

మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  వైద్యరంగంలో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న వెల్ నెస్ అడ్వాన్సుడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిజామాబాదులో ప్రారంభించడం అభినందనీయమని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఖలీల్ వాడిలో ఆదివారం బోధన్ ఎమ్మెల్యే  వెల్ నెస్ ఆసుపత్రిని ప్రారంభించారు. అత్యాధునిక వైద్య విధానంతో ఏడవ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.  హైదరాబాద్ మహానగరానికి  వెళ్లకుండా అత్యాధునిక వైద్య...