28.2 C
Hyderabad

కంటిచూపు కాపాడుకుందామ్

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రముఖ వైద్యులు డిఎల్ఎన్ స్వామి, రాములు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కళ్ళు బాగుంటేనే ప్రపంచాన్ని చూడవచ్చని, వాటిని నిత్యం రక్షించుకోవాలని ప్రముఖ వైద్యులు డి. ఎల్. ఎన్ స్వామి, రాములు అన్నారు. నిజామాబాద్ ఆపీసర్స్ క్లబ్ లో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. శరీర అవయవాల్లో కళ్ళు ప్రధానమైనవని అన్నారు. నేటి వాతావరణ పరిస్థితులలో కాలుశ్యం ఎక్కువైపోయిందని, కళ్ళలో దుమ్ము, దూలి పేరుకుపోయే అవకాశం ఉన్నదని వారు తెలిపారు. మనుషుల ఆరోగ్యరీత్యా కూడా కంటి పరీక్షలు అవసరమని అన్నారు. క్లబ్ కార్యదర్శి స్వామిదాస్ మాట్లాడుతూ క్లబ్ సభ్యుల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ సంయుక్త కార్యదర్శి సాయిలు,కోశాధికారి శరత్ కుమార్,క్లబ్ సభ్యులు రామరాజు,సత్యనారాయణ,సంతోష్ నిర్మల్కర్, విజయ్ కుమార్,దాసు,ఆశ నారాయణ,గాలిపల్లి వెంకటేష్, అంబాల గజానంద్, సాయిరెడ్డి,క్లబ్ మేనేజర్ సురేష్ కుమార్, డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి రాజు, గణేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article