28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ సలహాదారుని కలిసిన స్టేట్ రెడ్డి జె. ఏ. సీ నేతలు

హైద్రాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రెడ్డి జె. ఏ. సీ కి ఇచ్చిన హామీ ప్రకారం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కై రూ. 2000 కోట్ల నిధులను కేటాయించాలని కోరుతూ రాష్ట్ర రెడ్డి జెఏసీ ప్రతినిధులు శనివారం ప్రభుత్వ సలహాధారు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. హైద్రాబాద్ లో రెడ్డి భవన నిర్మాణనకు నిధులను ఇవ్వాలని, అందుకు సంబంధించిన విధి, విధానాలను అమలు చేసేలా చూడాలని వారు నరేందర్ రెడ్డిని కోరారు. అందుకు స్పందించిన ఆయన విషయాన్ని సీ. ఏం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు జెఏసీ నేతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుని కలిసిన వారిలోఈ కార్యక్రమంలో రాష్ట జె ఏ సీ చైర్మన్ అప్పమ్మగారి రామ్ రెడ్డి, కో చైర్మన్ పైళ్ల హరినాథ్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి చిటుకు ల నర్సిహ్మ రెడ్డి ,ఉత్త ర తెలంగాణ అధ్యక్షులు పెండ్యాల రామ్ రెడ్డి, రాష్ట్ర సలహా దారు జినుగు గోవర్ధన్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు నారెడ్డి రవీందర్ రెడ్డి,కరీంనగర్ అధ్యక్షులు జున్నుతుల రాజీ రెడ్డి,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి ,సలహాదారు అనిరుద్ర రెడ్డి ,మేడ్చల్ మహిళ అధ్యక్షురాలు పీసరి రాధిక రెడ్డి కార్యదర్శి బొక్క శ్రీనివాస్ రెడ్డి ,కరీంనగర్ అధ్యక్షురాలు రజిత రెడ్డి, మేడ్చల్ సభ్యులు బొక్క జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article