నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో జాదవ్ శివతేజ(19) అనే యువకుడు శనివారం రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన శివతేజ జీవితంపై విరక్తి చెంది రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
