24.8 C
Hyderabad

అధికారిని దూషించిన వ్యక్తిపై కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇన్‌చార్జ్ ఎంపీడీవో ప్రకాష్  ఈ నెల 25న తన కార్యాలయంలో విధుల్లో ఉండగా లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన బేగరి సాయిలు అనే వ్యక్తి కళ్యాణలక్ష్మి పథకం కోసం వివాహ ధ్రువీకరణ పత్రంపై గెజిటెడ్ సంతకం కోసం ఆయనను కలిశాడు. ధృవపత్రాలను పరిశీలించిన ప్రకాష్ అవి సరిగా ఉన్నాయో లేదో తన సిబ్బంది పరిశీలించాకే సంతకం చేస్తానని తెలిపారు. సాయిలు అనుచితంగా ప్రవర్తించి, అశ్లీల పదజాలంతో ఎంపీడీవోను దూషించినట్లు, పత్రాలు సరిగా లేనందున సంతకం చేయలేనని స్పష్టం చేసిన ఇన్‌చార్జ్ ఎంపీడీవో ప్రకాష్ ని సాయిలు అడ్డగించి విధులకు ఆటంకం కలిగించినట్టు ఇన్‌చార్జ్ ఎంపీడీవో  ప్రకాష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీడీవో ఫిర్యాదు ఆధారంగా సాయిలుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

More articles

Latest article