26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఉపాధ్యాయుల కొరతతో విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది

Must read

📰 Generate e-Paper Clip

  • ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలో ప్రాథమిక,ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించడానికి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను, స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని విద్యాశాఖ  నిర్ణయించడం శోచనీయమని, దీనివల్ల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఏర్పడి విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్ మండిపడ్డారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నిజామాబాదు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేశపురం రమేష్, మల్లమారి మల్లికార్జున్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందుకు ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు,ఎంఈఓ లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి, ప్రతి మండలానికి ఒక ఎంఈఓ ను, డివిజన్కి ఒక జిల్లా ఉప విద్యాశాఖ అధికారిని  నియమించాలని, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో జరుగుతున్న అక్రమ ఉపాధ్యాయుల డిప్టేషన్లను, అనధికార బదిలీలను నిలిపివేసి, రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఎస్ జి టి, స్కూల్ అసిస్టెంట్లు, గేజిటెడ్ ప్రధానోపాధ్యాయులను పదోన్నతుల ద్వారా నియమించి, తద్వారా ఏర్పడిన ఖాళీలను  డీఎస్సీ 2025 ప్రకటించి ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉపాధ్యాయ నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర బాధ్యులు ఏ.రాజన్న, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article