ఉపాధ్యాయుల కొరతతో విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలో ప్రాథమిక,ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించడానికి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను, స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని విద్యాశాఖ  నిర్ణయించడం శోచనీయమని, దీనివల్ల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఏర్పడి విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్ మండిపడ్డారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నిజామాబాదు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేశపురం రమేష్, మల్లమారి...